Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్డు రెన్యువల్‌ అన్నారు.. రూ.1, 99, 600 లక్షలు లాగేశారు.. నమ్మొద్దు బాబో ఓరి కార్డన్న...

ఏటీఎం సమాచారం ఎవ్వరు అడిగినా చెప్పొద్దంటూ ఎంతగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టి మోసపోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తాజా సంఘటన . ఖాతాదారుడికి మాయ మాటలు చెప్పి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1, 99, 600 లక్షలు డ్రా చేశారు.

కార్డు రెన్యువల్‌ అన్నారు.. రూ.1, 99, 600 లక్షలు లాగేశారు.. నమ్మొద్దు బాబో ఓరి కార్డన్న...
హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (06:01 IST)
ఏటీఎం సమాచారం ఎవ్వరు అడిగినా  చెప్పొద్దంటూ ఎంతగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టి మోసపోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తాజా సంఘటన . ఖాతాదారుడికి మాయ మాటలు చెప్పి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1, 99, 600 లక్షలు డ్రా చేశారు. 
 
రాజోలు ఎస్సై ఎస్‌.లక్ష్మణరావు తెలిపిన వివరాలమేరకు మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన దాకే విశ్వనాధానికి జగ్గన్నపేట ఎస్‌బీఐ శాఖలో ఖాతా ఉంది. గత నెల 17వ తేదీన అతని సెల్‌కు జగ్గన్నపేట ఎస్‌బీఐ మేనేజర్‌ పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ ఏటీఎం కార్డు పాడైపోయింది. దాన్ని రెన్యువల్‌ చేయించుకోవల్సి ఉందని, అందుకు గాను మీ ఏటీఎం కార్డు నెంబర్‌ చెప్పాలని అపరిచిత వ్యక్తి విశ్వనాధంను అడిగాడు.
 
అతని మాటలు నమ్మిన విశ్వనాధం ఏటీఎం కార్డు నంబర్‌ చెప్పాడు. తరువాత డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి చూడగా అతని ఖాతాలో డబ్బులు పోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. గత నెల 17, 18, 19, 20 తేదీల్లో వరుసగా నాలుగు రోజులు రూ.49,900 వంతున మొత్తం రూ.1,99,600 తన ఖాతా నుంచి ఆగంతకులు డ్రా చేశారని విశ్వనాధం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చోరీతో పెళ్లి ఆగిపోయిందని వాపోయాడు. విశ్వనాధం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.
 
కార్టు వివరాలు చెప్పమని, రెన్యువల్ చేయడానికి పాస్ వర్డ్ చెప్పాలని ఎవరు కాల్ చేసి అడిగినా ఇవ్వొద్దని, చెప్పొద్దని బ్యాంకులు మొత్తుకుంటూనే ఉన్నాయి. కానీ జనం మోసపోతూనే ఉన్నారు.

ఇన్ని లక్షల పేపర్లు, ఇంటర్నెట్ మీడియా, టీవీలు, ఆన్‌లైన్ అలర్ట్‌లు.. సమాచారం కుప్పలు తెప్పలుగా మనిషి మీద పడి దాడిచేస్తున్నా. కార్డు లావాదేవీల్లో మోసాలు మాత్రం ఆగడం లేదు. దేశం దేశాన్నే డిజిటలైజ్ చేయాలని అత్యుత్సాహం చూపుతున్న పాలకులు ఈ కాస్త డిజిటల్ తోనే జనం నిలువునా మునిగిపోతున్న విషాదంపట్ల ఏమని స్పందిస్తారో మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇదీ బీజేపీ మార్క్ రాజకీయం అంటే.. ఆర్కే నగర్‌ బరిలో సినీనటి గౌతమి