Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ అంబానీ బాగా బరువు తగ్గారు.. 70 కేజీలు తగ్గారట!

జూనియర్ అంబానీ బాగా బరువు తగ్గారు

జూనియర్ అంబానీ బాగా బరువు తగ్గారు.. 70 కేజీలు తగ్గారట!
, ఆదివారం, 20 మార్చి 2016 (12:03 IST)
జూనియర్‌ అంబానీ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ అందరికీ గుర్తుండే ఉంటాడు.. ఐపీఎల్‌ సందర్భంగా ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ తన భారీకాయంతో అందరినీ దృష్టినీ ఆకర్షించిన ఆయన ఇప్పుడు ఒక్కసారిగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. కొద్దినెలల క్రితం వరకు భారీ కాయంతో కనిపించిన ఆయన ఒక్కసారిగా సన్నబడి అందరికీ షాకిచ్చాడు. 
 
సోమ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకునేందుకు శనివారం వచ్చిన ఆయన్ను చూసి పలువురు షాక్ తిన్నారు. సుమారు 70కిలోల వరకూ బరువు తగ్గినట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శిక్షణలో ఇది సాధ్యపడిందని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu