Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్‌సిఎల్ టెక్ గ్రాంట్ ద్వారా హెచ్‌సిఎల్ ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు

Advertiesment
Water project

ఐవీఆర్

, గురువారం, 6 నవంబరు 2025 (23:28 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
భారతదేశంలో హెచ్‌సిఎల్ టెక్ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత ఎజెండాను ప్రోత్సహిస్తున్న హెచ్‌సిఎల్ ఫౌండేషన్ భారతదేశంలో తమ నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా వినూత్నమైన గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులను మద్దతు చేస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం, హెచ్‌సిఎల్ టెక్ గ్రాంట్ యొక్క 10వ వార్షికోత్సవం సంబరం ఈరోజు చేసింది.
 
2015లో ప్రారంభమైన నాటి నుండి, హెచ్‌సిఎల్ టెక్ గ్రాంట్ 2.3 మిలియన్ జీవితాలపై సానుకూలమైన ప్రభావం చూపించడానికి ప్రాజెక్టులలో రూ. 169 కోట్లు పెట్టుబడి పెట్టింది. గత 10 ఎడిషన్స్‌లో NGOల నుండి 13,000+ ప్రతిపాదనలు, 87,000+ రిజిస్ట్రేషన్స్‌లో కార్యక్రమం యొక్క విశ్వశనీయత కనిపించింది. పూర్తిచేయబడిన 49 ప్రాజెక్టులు, 18 యాక్టివ్ ప్రాజెక్టులతో, అట్టడుగు స్థాయిల్లో హెచ్‌సిఎల్ టెక్ గ్రాంట్ సమీకృక మార్పు కలిగించడాన్ని కొనసాగిస్తోంది. భారతదేశం అభివృద్ధి వ్యవస్థలో అవసరమైన మౌళిక సదుపాయాలు అమలు చేయడం, నమ్మకం కోసం కొత్త ప్రమాణాలను రూపొందిస్తోంది.
 
గత దశాబ్దంగా, కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించింది
114 మిలియన్ లీటర్ల నీరు సంరక్షించబడింది
245 జలాశయాలు నిర్మించబడ్డాయి/పునరుత్తేజం చేయబడ్డాయి
కార్బన్ ఉద్గారాల్లో 67,095 టన్నులు తగ్గించబడ్డాయి
2,722 టన్నుల వ్యర్థాలు రీసైకిల్ చేయబడ్డాయి/సుస్థిరమైన యాజమాన్యం కిందకు తీసుకురాబడ్డాయి
1.77 లక్షల చెట్లు నాటబడ్డాయి
0.12 హెక్టార్ల భూ ప్రాంతం శుద్ధి చేయబడింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్