Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22 రాష్ట్రాల్లో బోర్డర్ చెక్ పోస్టుల తొలగింపు.. జీఎస్టీతో కమీషన్లూ గోవిందా

దేశంలోని అన్ని రకాల సేవా పన్నులను తొలగించి వాటి స్థానంలో ఏకీకృత పన్ను రూపంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడమే తరువాయి. దేశంలోని 22 రాష్ట్లాల్లోని సరిహద్దు చెక్ పోస్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.

22 రాష్ట్రాల్లో బోర్డర్ చెక్ పోస్టుల తొలగింపు.. జీఎస్టీతో కమీషన్లూ గోవిందా
హైదరాాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (07:19 IST)
దేశంలోని అన్ని రకాల సేవా పన్నులను తొలగించి వాటి స్థానంలో ఏకీకృత పన్ను రూపంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడమే తరువాయి. దేశంలోని 22 రాష్ట్లాల్లోని సరిహద్దు చెక్ పోస్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. ఇలా బోర్డర్ చెక్ పోస్టులను తొలగించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్,బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయని ఈ ప్రకటనలో తెలిపారు. అస్సాం, హిమాచల ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దు చెక్ పోస్టులను తొలిగించే ప్రక్రియ వేగం పుంజుకుంది. 
 
జమ్మూ-కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి గూడ్స్ అండ్ సర్వీసెల్ టాక్స్ (జీఎస్టీ) అమలులోకి వచ్చింది. ఈ ఏకీకృత జాతీయ పన్ను ఆవిర్భావంతో డజన్ల కొద్దీ కేంద్ర, రాష్ట్ర పన్నులు రద్దు కాగా దేశవ్యాప్తంగా సరకులను ఒక చోటి నుంచి మరోచోటికి సులభంగా తరలించడానికి వీలయింది. జీఎస్టీ ఉనికి లోకి రావడంతో రద్దయిన రాష్ట్ర పన్నులు వివరాలు. సర్ చార్జీలు, లగ్జరీ టాక్స్, రాష్ట్ర వ్యాట్, కొనుగోలు పన్ను, కేంద్ర అమ్మకపు పన్ను, ప్రకటనలపై పన్నులు, వినోద పన్ను, అన్ని రకాల ఎంట్రీ టాక్సులు, లాటరీలు, బెట్టింగులపై టాక్సులు వంటివి మొత్తంగా రద్దయిపోయాయి.
 
జీఎస్టీ ఉనికి లోకి రావడంతో రద్దయిన కేంద్ర పన్నులు వివరాలు: సేవా పన్ను, ప్రత్యేక అదనపు కస్టమ్ సుంకాలు, ప్రత్యేక ప్రాధాన్యత కల వస్తువులపై అదనపు ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర ఎక్సైజ్, అదనపు కస్టమ్స్ సుంకాలు, వైద్యం మరియు టాయిలెట్ సన్నాహకాలపై పన్ను, జౌళి, జౌళి ఉత్పత్తులపై అదనపు సుంకాలు, పన్నులు, సర్‌చార్జీలు వంటి కేంద్ర పన్నులు మొత్తంగా ఉనికిలో లేకుండా పోయాయి.
 
ఇలా భారతీయ మార్కెట్టును ఏకీకృతం చేయడం ద్వారా బ్రిటిష్ వారి నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు గాంధీ చేపట్టిన అహింసా పోరాటంలో చేరడంలో జాతీయ బూర్జువాలను నడిపించిన దార్శనికతను జీఎస్టీ ప్రతిఫలించిందని చెప్పవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనితో భార్య సన్నిహితంగా ఉంటుందనీ... భర్త సూసైడ్