Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద నోట్ల రద్దుతో నగర పాలక సంస్థలకు రూ.కోట్ల ఆదాయం... ఎలా?

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో నగర, పురపాలక సంస్థలకు కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి పన్ను చెల్లించని బడా బాబులంతా.. తమ వద్ద ఉన్న చెల్లని నోట్లతో పన్నులు చెల్ల

Advertiesment
Demonetisation windfall
, బుధవారం, 23 నవంబరు 2016 (15:59 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో నగర, పురపాలక సంస్థలకు కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి పన్ను చెల్లించని బడా బాబులంతా.. తమ వద్ద ఉన్న చెల్లని నోట్లతో పన్నులు చెల్లించడమే. గతంలో పోల్చితో ఇపుడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరుతోంది. ఈ ఆదయం పెరుగుల అక్షరాలా 268 శాతంగా ఉంది.
 
దేశంలోని 47 మున్సిపాలిటీల్లో గత సంవత్సరంతో పోల్చితే పన్నుల నుంచి వచ్చిన ఆదాయం దాదాపు రెట్టింపయింది. ఒక్క మన హైద్రాబాద్‌లోనే నవంబర్ 22 నాటికి రూ.208 కోట్ల పన్ను చెల్లింపులు జరిగాయంటే జీహెచ్‌ఎంసీకి ఏ రేంజ్‌లో ఆదాయం సమకూరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
ఇన్నాళ్లు పన్ను కట్టాలంటూ ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని బడా బాబులు నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే కోట్ల రూపాయలను మున్సిపాలిటీలకు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. నగరాల్లో నల్ల దొంగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనడానికి ఈ పన్ను చెల్లింపుల వ్యవహారమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపులు ఎంతలా పెరిగాయో ఈ వివరాలే కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీకి నవంబర్ 2015లో 8 కోట్ల రూపాయల పన్ను చెల్లింపుల ద్వారా ఆదాయం సమకూరగా, నవంబర్ 22 తేదీ నాటికి 208 కోట్ల రూపాయల ట్యాక్స్‌ చెల్లింపులు జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరం రూ.3,185 కోట్ల చెల్లింపులు జరగ్గా, ఈ సంవత్సరం రూ.11,913 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా సమకూరింది. 
 
సూరత్‌లో గత సంవత్సరం రూ.7.19 కోట్లు, నోట్ల రద్దు తర్వాత రూ.100 కోట్లు, అహ్మదాబాద్‌లో 2015 నవంబర్‌లో రూ.78 కోట్ల పన్ను చెల్లింపులు జరగ్గా, 2016 నవంబర్‌లో రూ.170 కోట్లు పన్నుల ద్వారా అహ్మదాబాద్ మున్సిపాలిటీ ఆదాయాన్ని గడించింది. కల్యాణ్ మున్సిపాలిటీ గత సంవత్సరం రూ.120 కోట్లు, ఈ నవంబర్‌లో 170 కోట్ల రూపాయలను పన్ను రూపంలో బడా బాబులు చెల్లించారు. ఈ ఐదు మున్సిపాలిటీలతో పాటు మరో 44 మున్సిపాలిటీల మొత్తం ఆదాయం అక్షరాల రూ.13,192 కోట్లు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉర్జిత్ పటేల్ భార్య.. నీతా అంబానీకి సోదరి కాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం..