Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.200 రాయితీపై జీరో బ్యాగ్ టిక్కెట్లు విక్రయిస్తూ రూ.750 అపరాధమా?

రూ.200 రాయితీపై జీరో బ్యాగ్ టిక్కెట్లు విక్రయిస్తూ రూ.750 అపరాధమా?
, శనివారం, 29 ఆగస్టు 2015 (14:12 IST)
ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. రూ.200 డిస్కౌంట్‌‍పై జీరో బ్యాగ్ టిక్కెట్లను విక్రయిస్తూ చివరి నిమిషంలో లగేజీతో వచ్చే ప్రయాణికుల నుంచి రూ.750 అపరాధం విధించడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది. ఇంత మొత్తంలో వసూలు చేయడానికి వీలులేదని కేవలం రూ.400 మాత్రమే వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 
 
రూ.1000 కన్నా తక్కువ ధరలకే టికెట్లను విక్రయిస్తున్న స్పైస్‌జెట్, లగేజీ తీసుకువచ్చే వారిపై రూ.750 జరిమానా విధిస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో 'జీరో బ్యాగ్' డిస్కౌంట్ పొంది ప్రయాణ సమయంలో లగేజీ తీసుకెళ్లిన వారి నడ్డివిరిచేలా అపరాధాన్ని వసూలు చేస్తోంది. దీనిపై అనేక విమర్శలు వచ్చినా ఆ సంస్థ వెనక్కి తగ్గలేదు. 
 
దీంతో డీజీసీఏ కల్పించుకుంది. సాధారణ టికెట్ తో పోలిస్తే రూ.200 డిస్కౌంటుపై జీరో బ్యాగ్ టికెట్లు విక్రయిస్తూ.. జరిమానాగా అంత మొత్తం విధించడం సరికాదని అభిప్రాయపడుతూ, రూ.400 పెనాల్టీ సరిపోతుందని స్పైస్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అన్ని దేశవాళీ విమానయాన సంస్థలు ప్రస్తుతం 15 కిలోల వరకూ ఉచిత చెకిన్ బ్యాగేజీ సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అంటే, 15 కిలోల్లోపు బరువైన లగేజీలను తీసుకువెళ్లేవారు జీరో బ్యాగ్ పథకంలో టికెట్ తీసుకుని, అంతకుమించి లగేజీతో వెళి విమానం ఎక్కాలంటే, రూ.400 కట్టాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu