Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్యూరిటీ అండ్ ఫైర్ సేఫ్టీ షో : చెన్నై కంపెనీ పాత్ర!

సెక్యూరిటీ అండ్ ఫైర్ సేఫ్టీ షో : చెన్నై కంపెనీ పాత్ర!
, శనివారం, 9 నవంబరు 2013 (17:31 IST)
డిసెంబర్ నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు గ్రేటర్ నోయిడాలోని ఎక్సో సెంటర్‌లో జరుగనున్న కమర్షియల్ సెక్యూరిటీ, సివిల్ సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీలపై జరిగే ఏడో ఎడిషన్‌లో చెన్నైకు చెందిన వెరిప్రాక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలుపంచుకోనుంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియో, యూబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ వెర్గీసీ వి జోసెఫ్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవలి కాలంలో సౌత్ ఆసియాలో తీవ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయని, వీటి అడ్డుకట్టకు సరైన భద్రత ప్రమాణాలు పాటించాల్సి వుందన్నారు.

ముఖ్యంగా, బ్యాంకులు, కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, హోటల్స్, హాస్పిటల్స్, ఐటీ, బీపీఓ సెంటర్లు, క్రీడా, వినోద కేంద్రాలు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులతో పాటు.. టెలికామ్, గిడ్డంగులు, రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జ్యువెలరీ, రీటైల్ షోరూమ్‌లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. ఈ భద్రతకు నోయిడాలో జరుగనున్న "ఐఎఫ్ఎస్ఈసీ ఇండియా 2013" ప్రదర్శన ఒక పరిష్కార మార్గం చూపుతుందన్నారు.

ప్రస్తుతం భారత సెక్యూరిటీ మార్కెట్ 30 నుంచి 35 శాతం వృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ బడ్జెట్‌ నిధులను 35 శాతం మేరకు పెంచిందని, అలాగే, ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను ఖర్చు చేయనుందని తెలిపారు. అదేసమయంలో దేశంలో ఉన్న 7500 కిలోమీటర్ల పొడవున్న కోస్తాతీర భద్రతను కూడా పెంచిందన్నారు.

గ్రేటర్ నోయిడాలో జరిగే సెక్యూరిటీ సదస్సుకు రాష్ట్రానికి చెందిన వెరిప్రాక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సు దక్షిణాసియాలోనే అతిపెద్ద కమర్షియల్ సెక్యూరిటీ సదస్సు అని చెప్పారు. ఇందులో రాష్ట్రానికి చెందిన అనేక కంపెనీలు పాలుపంచుకుని లబ్ధిపొందనున్నట్టు ఆయన వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu