Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యాపార రంగంలో ముందున్న భారతీయ మహిళలు

వ్యాపార రంగంలో ముందున్న భారతీయ మహిళలు
FILE
వ్యాపార రంగంలో భారతీయ మహిళలు రోజురోజుకు తమ సత్తా చాటుకుంటున్నారని బ్రిటన్‌కు చెందిన బిజినెస్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది.

బ్రిటన్‌కు చెందిన బిజినెస్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ నిర్వహించిన సర్వేననుసరించి భారతదేశంలోని మహిళలు వ్యాపార రంగంలో పురోగతిని సాధిస్తున్నారని ఆ పత్రిక లండన్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా వ్యాపార రంగంలో అగ్రగామిగానున్న ప్రపంచంలోని 50 మంది మహిళల జాబితా విడుదల చేసింది.

ఇందులో భారతదేశానికి చెందిన మహిళామణులు తమ సత్తా చాటుకుంటున్నారని, తాము నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 50 మంది మహిళల్లో భారత సంతతికి చెందిన ఇందిరా నూయి ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు. కూల్‌డ్రింక్ రంగంలో అగ్రగామిగానున్న కోలా కంపెనీకి చెందిన సీఈఓ ఇందిరా నూయీ ప్రథమ స్థానంలో ఉన్నారని ఆ పత్రిక వెల్లడించింది.

బ్రిటానియా సీఈఓ వినీతా బాలీకి 22వ స్థానం, బయోకాన్‌కు చెందిన మజూందార్ షాకు 47వ స్థానం, హెచ్‌టీ మీడియాకు చెందిన శోభనా భరతియాకు 48వ స్థానం లభించినట్లు సంస్థ తెలిపింది.

ఇదిలావుండగా "50 టాప్ వుమెన్ టు వాచ్" విడుదల చేసిన జాబితాలోను ముగ్గురు భారతదేశపు మహిళలకు చోటు దక్కిందని జాబితా పేర్కొంది. ఈ జాబితాలో స్విస్ బ్యాంక్ యూబీఎస్ ఇండియాకు చెందిన సీఈఓ మనీషా గ్రివోరత్రా, గ్లోబల్ బ్యాంక్ హెచ్ఎస్‌బీసీ ఇండియా ప్రతినిధి నైనా లాల్ కిద్వాయి, కంప్యూటర్ రంగంలో అగ్రగామిగానున్న హెచ్‌పీ ఇండియాకు చెందిన ఎమ్‌డీ నీలమ్ ధవన్‌లకు స్థానం దక్కింది.

ఫైనాన్షియల్ టైమ్స్ విడుదల చేసిన మరో జాబితాలో " టాప్ 50 వుమెన్ ఇన్ వరల్డ్ బిజినెస్ "లో పెప్సికోకు చెందిన సీఈఓ నూయీ తర్వాత అమెరికాకు చెందిన కంపెనీ ఏవన్ ప్రోడక్ట్స్‌కు చెందిన ఐండ్రియా జుంగ్‌కు రెండవ స్థానం లభించింది. ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీ ఏరేవాకు చెందిన ఏనీ లావర్జియన్‌కు మూడవ స్థానం లభించింది.

తాము నిర్వహించిన సర్వేలో దాదాపు 500 మంది ప్రముఖ కంపెనీల ప్రతినిధులను ఎన్నుకున్నామని, ఇందులో మహిళలు సీఈఓలుగా కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నారని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. పెద్ద పెద్ద కంపెనీల్లోనున్న డైరెక్టర్లలో మహిళలు పది శాతం ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది. ఆసియాలో ఇది చాలా తక్కువగానే ఉందని తెలిపింది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీల్లో నార్వే ముందుందని ఎఫ్‌టీ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu