Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశాల్లో దేశీయ కార్లు, మోటారు సైకిళ్ళకు డిమాండ్

విదేశాల్లో దేశీయ కార్లు, మోటారు సైకిళ్ళకు డిమాండ్
, మంగళవారం, 11 మే 2010 (16:35 IST)
PTI
దేశంలో తయారైన కార్లు, మోటారు సైకిళ్ళకు విదేశాల్లో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో దేశీయ మోటారు సైకిళ్ళ ఎగుమతుల్లో 95.71 శాతం వృద్ధి చెందింది. అదే కార్ల ఎగుమతుల్లో 27.88 శాతం వృద్ధి చెందినట్లు సియామ్ వెల్లడించింది.

భారతదేశంలో నిర్మితమైన కార్ల ఎగుమతుల్లో ఏప్రిల్ నెలలో 27.88 శాతం వృద్ధిచెంది 37,479 కార్లు ఎగుమతయ్యాయి, అదే నిరుడు ఇదే కాలానికి జరిగిన కార్ల ఎగుమతుల్లో 29307 కార్లు ఎగుమతయ్యాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో మోటారు సైకిళ్ళ ఎగుమతుల్లోను 95.71 శాతం వృద్ధి చెంది 1,27,336 ద్విచక్ర వాహనాలు ఎగుమతయ్యాయి. అదే నిరుడు ఇదే కాలానికి జరిగిన మోటారు సైకిళ్ళ ఎగుమతుల్లో దేశం నుంచి 65064 ద్విచక్ర వాహనాలు ఎగుమతయ్యాయి.

గడచిన ఏప్రిల్ నెలలో అన్ని కంపెనీలకు చెందిన అన్ని రకాల వాహనాల ఎగుమతుల్లో 87.61 శాతం వృద్ధి చెంది 201543 వాహనాలు ఎగుమతయ్యాయి, అధే నిరుడు ఇదే కాలానికి దేశం నుంచి మొత్తం 107424 వాహనాలు విదేశాలకు ఎగుమతయ్యాని సియామ్ వెల్లడించింది.
webdunia
WD


వీటిలో మారుతి సుజుకీకి చెందిన కార్లు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 89.55 శాతం పెరిగి 12937 కార్లు ఎగుమతయ్యాయి. అదే నిరుడు ఇదే కాలానికి మారుతి సంస్థ 6825 కార్లను ఎగుమతి చేసింది. మరో కార్ల కంపెనీ అయిన హుండాయ్ మోటార్ ఇండియా సంస్థకు చెందిన కార్ల ఎగుమతుల్లో 6.31 శాతం పెరిగి 23519 కార్లు ఎగుమతయ్యాయి. అదే నిరుడు ఇదే కాలానికి ఈ సంస్థకు చెందిన కార్లు 22124 వాహనాలు ఎగుమతయ్యాయి. టాటా మోటార్స్ సంస్థకు చెందిన కార్ల ఎగుమతుల్లో 96.30 శాతం వృద్ధి చెంది 424 కార్లు ఎగుమతయ్యాయి. అదే నిరుడు ఇదే కాలానికి ఈ సంస్థకు చెందిన కార్ల ఎగుమతుల్లో 216 వాహనాలు ఎగుమతులైనట్లు సియామ్ పేర్కొంది.

కాగా మోటారు సైకిళ్ళ ఎగుమతుల్లో బజాజ్ సంస్థ రెండింతల వృద్ధిని సాధించి 88101 ద్విచక్ర వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. అదే టీవీఎస్ మోటార్ సంస్థ 88.86 శాతం వృద్ధి సాధించి 16,992 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసినట్లు సియామ్ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu