Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన భారతి సిమెంట్

మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన భారతి సిమెంట్
, బుధవారం, 7 అక్టోబరు 2009 (16:20 IST)
Srini
WD
దేశీయ సిమెంట్ రంగంలోకి భారతి సిమెంట్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కంపెనీ తయారు చేసిన 53 గ్రేడ్ సిమెండ్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తమిళ హీరో సూర్య బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనిపై భారతి సిమెంట్ సంస్థ డైరక్టర్ (మార్కెంటింగ్) ఎం.రవీంధ్రా రెడ్డి బుధవారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని వినియోగదారులకు తమ సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు సిమెంట్ పరిశ్రమకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఇది సిమెంట్ రంగంలోకి అడుగుపెట్టేందుకు మంచి తరుణమన్నారు.

దేశ సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా వెలుగొందేందుకు నాణ్యవంతమైన సిమెంట్‌ను సరఫరా చేయడంతో పాటు వినియోగదారులు ఉన్నతమైన సేవలు అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం 600 డీలర్లు, వెయ్యి సబ్ డీలర్లను నియమించినట్టు తెలిపారు. ఈ సంఖ్య నానాటికీ రోజురోజుకూ పెరుగుతోందన్నారు.

కడప జిల్లా, కమలాపురం మండలం, నల్లలింగాయపల్లి అనే గ్రామంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన భారతి సిమెంట్ పరిశ్రమ నిర్మితమైవుంది. ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేసిన భారతి బ్రాండ్‌తో కూడిన సిమెంట్ బుధవారం నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో పెరుగుతున్న సిమెంట్ డిమాండ్‌కు తగినట్టుగా 50 లక్షల టన్నుల వరకు సిమెంట్‌ ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. ఇందులో తొలివిడతగా 25 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ సిద్ధమైందన్నారు. మిగిలిన రెండో యూనిట్ వచ్చే 2010 నాటికి తయారవుతుందని ఆయన తెలిపారు.

"2012 సంవత్సరంలో ఇండియా సిమెంట్ వ్యాపారం భవిష్యత్తు" అనే ఆర్ఎన్‌సిఓఎస్ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సిమెంట్ తయారీలో చైనా దేశం అగ్రస్థానంలో ఉంది. చైనా తర్వాతి స్థానంలో మన భారతదేశం రెండో స్థానంలో ఉందని చెప్పారు.

గత కొద్దినెలలుగా సిమెంట్ వ్యాపారం అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. సిమెంట్ వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ సంస్థలు తమ
webdunia
Srini
WD
ఉత్పత్తిని వృద్ధి బాటలో నడిపిస్తున్న నేపథ్యంలో 2010-2012 సంవత్సరం నాటికి సిమెంట్ ఉత్పత్తి మరియు వినియోగం మరింత పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.


ఏఎఫ్ఎల్ సిమెంట్ మరియు లేష్ ద్వారా అత్యాధునిక ప్రమాణాలతో కూడిన సిమెంట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా భారతి సిమెంట్ సంస్థ భారీ పెట్టుబడులను వెచ్చించింది. సిమెంట్ ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకులు, వాటి పరిశోధన, సిమెంట్ ఉత్పత్తి నాణ్యతను గుర్తించే రీతిలో రోబోటిక్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా భారతి సిమెంట్ రంగం సిద్ధం చేసింది. అంతేగాకుండా.. లోష్ వ్యవస్థకు చెందిన వెర్టికల్ రోలర్ మిల్లులను నిర్మించేందుకు కూడా భారతి సిమెంట్ తగిన చర్యలు తీసుకుంది.

అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసే వెర్టికల్ రోలర్ మరియు పరిశోధన కేంద్రాల సహాయంతో భారతి సిమెంట్ విద్యుత్తును పొదుపుగా ఉపయోగించి, ముడిసరుకుల కేంద్రానికి జర్మన్ టెక్నాలజీని వినియోగించనుంది.

భారతి సిమెంట్ సంస్థ ఏర్పాటు చేసిన వెర్టికల్ రోలర్ మిల్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇంకా చెప్పాలంటే.. ఈ వెర్టికల్ మిల్ ద్వారా ఒక గంట సమయంలోనే 360 టన్నుల సిమెంట్‌ను గ్రైండ్ చేయవచ్చును. అదేవిధంగా ఈ మిల్లులో బేకింగ్, లోడింగ్ మరియు రైల్వే సైడింగ్ విభాగాలు కూడా ఉన్నాయి.

ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్, సిమెంట్-43 గ్రేడ్, ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్-53 గ్రేడ్, పోర్ట్ ల్యాండ్ బేస్లానా సిమెంట్ మరియు పోర్ట్‌ల్యాండ్ స్లాక్ సిమెంట్ వంటి అన్ని రకాలకు చెందిన సిమెంట్లను భారతి సిమెంట్ సంస్థ తయారు చేస్తుంది. ఇకపోతే.. ఫ్లై ఆష్‌ కోసం భారతి సిమెంట్ ఆర్‌టీటీపీ మరియు కర్ణాటకలోని, టోర్నాకల్, జిందాల్ స్టీల్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

సిమెంట్ తయారీ మాత్రమే కాకుండా రెడీ మిక్స్ కాంక్రీట్-ఆర్ఎంసీ శాఖలో కూడా భారతి సిమెంట్ సంస్థ స్థానం సంపాదించడం విశేషం. అలాగే భారతి సిమెంట్ నూతన సిమెంట్ తయారీ కేంద్రానికి సమీపంలోనే కాప్‌టివ్ పవర్ ప్లాంట్ -సిపిపి (విద్యుత్ ఉత్పత్తి కేంద్రం) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

భారతి సిమెంట్ కార్పొరేషన్ సంస్థ గురించి...
భారతి సిమెట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఆధారంగా చేసుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎఫ్ఎల్ స్మిత్ మరియు లోష్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2009 సెప్టెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, కమలాపురం, నల్లలింగాయపల్లి అనే గ్రామంలో ఈ సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. భారతి సిమెంట్ సంస్థ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాలకు సిమెంట్‌ను సరఫరా చేస్తోంది. సాక్షి గ్రూప్, ఇండియా సిమెంట్స్ మరియు డాల్మియా సిమెంట్స్ ద్వారా భారతి సిమెంట్ సంస్థ ఏర్పాటైంది.

Share this Story:

Follow Webdunia telugu