Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్నా నిర్వహించనున్న బ్యాంక్ ఉద్యోగులు

ధర్నా నిర్వహించనున్న బ్యాంక్ ఉద్యోగులు
FILE
దేశవ్యాప్తంగానున్న బ్యాంకుల ఉద్యోగులు ఆగస్టునెల 6 మరియు 7వ తేదీలలో తమ కోర్కెల సాధనకోసం ధర్నా నిర్విహంచేందుకు నిర్ణయించారు.

తమ న్యాయపరమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంతో పలుదఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేదని దీంతో గతంలో ప్రకటించిన విధంగా తాము ఈ నెల ఆరు మరియు ఏడవ తేదీలలో ధర్నా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు అఖిల భారతీయ బ్యాంక్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.ఎస్. విర్క్ తెలిపారు.

తాము ఈ ధర్నాలో పాల్గొంటున్నట్లు దేశవ్యాప్తంగానున్న అన్ని బ్యాంక్ సంఘాల సమూహం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ కేవలం బ్యాంక్ మేనేజర్ స్థాయి సంఘమైన ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌తో మాత్రమే చర్చలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu