Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ రాజధానిలో ఆర్థిక శిఖరాగ్ర సమావేశాలు

దేశ రాజధానిలో ఆర్థిక శిఖరాగ్ర సమావేశాలు
, శుక్రవారం, 6 నవంబరు 2009 (11:33 IST)
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక శిఖరాగ్ర సమావేశాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఈ నెల 8వ తేదీన ప్రారంభమౌతుంది.

ఆర్థికమాంద్యం తగ్గుముఖం పడుతున్న నేటి తరుణంలో భారత ప్రభు్త్వం నవంబర్ నెల 8వ తేదీన న్యూఢిల్లీలో " భారత ఆర్థిక శిఖరాగ్ర సమావేశం "ను ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా నైపుణ్యాల మెరుగుదల, పేదలకు ఆర్థిక సాధికారత, మహిళల ప్రతిభకు పట్టం కట్టే ప్రమాణాలవంటి కీలక అంశాలపై ఆర్థిక నిపుణులు చర్చించనున్నారు.

ఈ కీలక అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఆసియా విభాగానికి చెందిన ప్రతినిధి డైరెక్టర్ సుశాంత్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu