Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ పురోభివృద్ధికి ఆర్థికాభివృద్ది అవసరం: ప్రధాని

దేశ పురోభివృద్ధికి ఆర్థికాభివృద్ది అవసరం: ప్రధాని
దేశం పురోభివృద్ధి చెందాలంటే ఆర్థికాభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు ప్రధానమంత్రి మన్మోహన్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులను దేశ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. 2014 సాధారణ ఎన్నికల నాటికి వారు భారత్‌లో ఓటుహక్కు పొందగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ మాట్లాడుతూ, ఊహించని ఆర్థిక సంక్షోబాలు చుట్టుముట్టినప్పటికీ, ఈ ఏడాది ఆర్థికవృద్ధి రేటు 7 శాతం ఉండగలదన్నారు. రెండేళ్ళలో తిరిగి దేశం 9-10 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu