జీడీపీ వృద్ధి 6 నుంచి 7 శాతం చేరుకుంటుంది: చిదంబరం
వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరు నుంచి ఏడు శాతం వృద్ధిరేటు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ స్థూల దేశీయోత్పత్తి(జిడిపి) అంచనాను కేంద్ర గణాంకాల సంస్థ(సిఎస్ఒ) 5 శాతానికే పరిమితం చేయడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పందిస్తూ 5.5 శాతం అందుకుంటామనే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనా అత్యంత తక్కువైనది ఏమీ కాదని, 2000-01, 2002-03 ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన వృద్ధిరేటు కంటే ఎక్కువని చిదంబరం అన్నారు.