Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"గ్రీన్ హోమ్" ప్రాజెక్టును ప్రారంభించిన వీహెచ్ఐఎల్

, గురువారం, 22 అక్టోబరు 2009 (18:03 IST)
Srini
WD
భవన నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన చెరగని ముద్రను వేసుకున్న వాసవి హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (వీహెచ్ఐఎల్) సంస్థ "అనిఛామ్" పేరుతో గ్రీన్ హౌస్ ప్రాజెక్టును కొత్తగా ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌ శివారు ప్రాంతమైన కేలంబాక్కంలో ఈ ప్రాజెక్టును చేపట్టింది. తమ కష్టమర్లకు గోల్డ్ రేటింగ్‌‌తో కూడిన గ్రీన్ హోమ్‌ను అందించడమే తమ లక్ష్యమని ఆ సంస్థ డైరక్టర్ పి.బి.కృష్ణప్రసాద్ తెలిపారు.

దీనిపై ఆయన గురువారం చెన్నయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెన్నయ్‌కు 54 కిలోమీటర్ల దూరంలో ఓల్డు మహాబలిపురం, కేలంబాక్కంలో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు వివరించారు. గ్రీన్ హౌస్ భవంతులను నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతంగా చెప్పుకొచ్చారు.

పూర్తిస్థాయిలో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్‌లో ఒక హౌసింగ్ ప్రాజెక్టును నిర్మించడం చెన్నయ్‌లో బహుశా ఇదే తొలిసారని ఆయన అన్నారు. గ్రీన్ హౌస్ ప్రాజెక్టు కింద నిర్మించే బహుళ అంతస్తుల్లో ప్రకృతిలో భాగమైన సూర్యకాంతి, నీరు, గాలి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. పైపెచ్చు.. తక్కువ మోతాదులో వీఓసీ పెయింట్స్, ప్లంబింగ్ వస్తువులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఒక ఎకరం విస్తీర్ణంలో చేపట్టే ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.20 కోట్లుగా ఉంటుందని ఆయన తెలిపారు.

అలాగే, ఈ యేడాది డిసెంబరు నాటికి మరో రెండు గ్రీన్ ప్రాజెక్టులను ఇంజంబాక్కం, సెమ్మంజేరిలలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో ఒక చదరపు అడుగుల విస్తీర్ణానాన్ని రూ.2700గా నిర్ణయించినట్టు చెప్పారు. వచ్చే 2011 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. రెండు, మూడు బెడ్ రూమ్‌లతో ఈ బహుళ అంతస్తుల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, గత 1990 సంవత్సరం నుంచి భవన నిర్మాణ రంగంలో కొనసాగుతున్న వాసవి నిర్మాణ సంస్థ చెన్నయ్, దాని పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు 50 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రతి వినియోగదారుడు ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్స్‌ను బిల్డర్ నుంచి కొనుగోలు చేయడం ఈ సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఈ నమ్మకమమే సంస్థ చేపట్టే ప్రాజెక్టుల నాణ్యత, సమర్థ నాయకత్వాన్ని రుజువు చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu