Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక సమీక్ష ముఖ్యాంశాలు

ఆర్థిక సమీక్ష ముఖ్యాంశాలు
, శనివారం, 20 ఫిబ్రవరి 2010 (12:13 IST)
FILE
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆర్థిక సమీక్ష ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10)లో దేశీయ ఆర్థిక వృద్ధి 7.2 శాతం పైగా వృద్ధి సాధిస్తుందన్న ఆశాభావం ఉంది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరం (2010-11)లో దేశీయ ఆర్థిక వృద్ధి 8.2 శాతానికి చేరుకోగా, మరో ఆర్థిక సంవత్సరం (2011-12)లో 9 శాతానికి చేరుకుంటుందని పిఎంఈఏసీ ఛైర్మెన్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు.

* రానున్న రోజుల్లో వ్యవసాయోత్పత్తులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయి.
* మూడవ, నాల్గగ త్రైమాసికంలో పారిశ్రామికోత్పత్తులు వృద్ధి బాటలో కొనసాగుతాయి.
* రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ధరలు ఇతర వాటిపై కూడా ప్రభావం చూపిస్తాయి.
* ప్రభుత్వ ఖజానాలో అధిక లోటు పూడ్చుకోలేనిది. 2010-11 లో ఖజానా లోటును కనీసం ఒక శాతం పూడ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.
* జిడిపితో పోలిస్తే ఖర్చులలో ఒక శాతం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది.
* వివిధ సేవల ద్వారా విధించే పన్నును మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి.
* ప్రతి సంవత్సరం ఎగుమతులు 168.7 వందల కోట్ల డాలర్ల మేరకు, అదే విధంగా దిగుమతులు 296.8 వందల కోట్ల డాలర్ల మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu