Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుంకుమపువ్వుతో బ్యూటీ టిప్స్ ఇవిగోండి!

కుంకుమపువ్వుతో బ్యూటీ టిప్స్ ఇవిగోండి!
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:30 IST)
కుంకుమపువ్వుతో చర్మఛాయను మెరుగుపరుచుకోవచ్చు. కుంకుమపువ్వును నులిమి ఒక టేబుల్ స్పూన్ నీటిలో బాగా నానబెట్టాలి. కుంకుమ నీరు ఎరుపుగా మారిన తర్వాత కాసింత వెన్నను కలిపి బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి పెదవులకు పట్టిస్తే చర్మం ఛాయ మెరుగవడంతో పాటు పింకీ లిప్స్‌ను సొంతం చేసుకోవచ్చు. మొటిమలు, మచ్చల్ని దూరం చేసుకోవచ్చు. 
 
ఈ మిశ్రమాన్ని గోళ్లకు రాసుకుంటే నెయిల్స్ షైనింగ్‌గా తయారవుతాయి. ఒక స్పూన్ కుంకుమ పువ్వు పొడికి కొన్ని చుక్కలు పాలు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మపు ఛాయ పెంపొందుతుంది. వారానికి ఒకసారి లేదా మాసానికి మూడు సార్లు ఇలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu