Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బత్తాయిరసాన్ని ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి మంచి కాంతి వస్తుందట!

బత్తాయిరసాన్ని ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి మంచి కాంతి వస్తుందట!
, సోమవారం, 12 అక్టోబరు 2015 (18:23 IST)
బత్తాయిరసం ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది. యాపిల్‌రసంలో తేనే కలిపి తాగితే రక్తం బాగా పడడమే కాకుండా గుండెదడ నయమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాగే ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష కలిపి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే అతిదాహం తగ్గిపోతుంది. మహిళలు ఈ నీటిని తాగడం లేదా ఖర్జూరాన్ని, ఎండు ద్రాక్షల్ని రోజుకు రెండేసి తీసుకుంటే అలసటను దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని అరికడుతుంది. జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 
గుండె ఆయాసం, రక్తపోటు ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తింటే మంచిది. నారింజపండు తీసుకుంటే ఆకలి వృద్ధి చెందుతుంది. గ్యాస్టిక్ ఆల్సర్ ఉన్నవారు పాలల్లో ద్రాక్షరసం కలిపి తీసుకుంటే అల్సర్‌కు మంచి మందుగా పనిచేస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu