Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మురికిని తొలగించి.. ముఖ తేజస్సును పెంచే ఆరంజ్..

మురికిని తొలగించి.. ముఖ తేజస్సును పెంచే ఆరంజ్..
, సోమవారం, 24 ఆగస్టు 2015 (16:53 IST)
ఆరోగ్యానికి మేలు చేసే పొషక విలువలు కలిగిన ఆరంజ్ పళ్లు అందానికీ కూడా మేలు చేస్తాయి. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని సందర్భాలలో ముఖంపై మురికీ, జిడ్డు పేరుకుపోతుంటుంది. అలాంటి సమయంలో ఖరీదైన క్రీములు, పౌడర్లూ వాడటం పరిష్కారం కాదు. ఆరంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి, పొడికేసుకోవాలి. ఒక స్పూన్ నారింజ పొడికి,  పెరుగును కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల ముఖానికి మంచి చాయ వస్తుంది. 
 
మురికి దూరమయ్యేలా, మొటిమలు రాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకునే ముందు గులాబీ నీళ్లూ, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, మర్నాడు ఉదయాన్నే కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది. ఇంకా ఒక టీస్పూన్ ముల్లంగి రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి పట్టించి అర గంట తర్వాత కడిగేసినా మంచిదే. ఇది బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రపరుస్తుంది.
 
ఇదే విధంగా ఒక టీస్పూన్ బొప్పాయి గుజ్జూ, ముల్తానీ మట్టీ కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖాన్ని తాజాగా మారుస్తుంది. చెంచా ఓట్స్‌లో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది.

అలాగే నాలుగు బాదం గింజలను మిశ్రమంలా చేసి, దానికి ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. సెనగపిండిలో గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక కడిగేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu