Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరిగిపోతున్న ఊబకాయం... పోషకాల బ్రేక్‌ఫాస్ట్‌తో చెక్..

పెరిగిపోతున్న ఊబకాయం... పోషకాల బ్రేక్‌ఫాస్ట్‌తో చెక్..
, గురువారం, 13 ఆగస్టు 2015 (15:09 IST)
ఇటీవల మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువైంది. ఇందుకు శరీర తీరు, జన్యుపరమైన లోపాలు వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ రోజు ఉదయం పూట తీసుకునే టిఫిన్‌తో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట టిఫిన్ తింటున్నారా, అందులో భాగంగా ఏమేం తీసుకుంటున్నారు. వాటివల్ల అందే పోషకాలేంటి.. ఓసారి సరిచూసుకోండి. ఎందుకంటే, సరైన పోషకాలు అందనప్పుడు ఆకలి పెరిగి రోజంతా అతిగా తినే పరిస్థితి ఎదురుకావచ్చు. 
నిత్యం బ్రేక్‌ఫాట్‌లో తినే బ్రెడ్, కొన్ని రకాల పదార్థాల వల్ల పిండి పదార్థాలు ఎక్కువగా అందొచ్చు. అయితే మనకు మాంసకృత్తులూ, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలూ అవసరం. దానివల్ల పొట్ట త్వరగా నిండుతుంది. శరీరానికి పోషకాలూ అందుతాయి. అందుకే సమృద్ధిగా ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని టిఫిన్‌గా ఎంచుకోవాలి. 
 
ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే.. భోజనానికముందు సలాడ్ తప్పనిసరి. సలాడ్‌లో ఎక్కువగా ఉండే పీచూ పదార్థం, నీటిశాతం వలన ఆకలి కంట్రోల్ అవుతుంది. అందుకే ఓ క్యారెట్, క్యాప్సికం, కొద్దిగా క్యాబేజీ తరుగూ, ఓ టొమాటోను భోజనానికి ముందు తీసుకునేలా చూసుకోవాలి. సాయంత్రం పూట టీ, కాఫీలు ఎక్కువగా తాగకపోవడం మంచిది. అందులో ఉన్న చక్కెర వలన కెలొరీలూ పెరుగుతాయి. 
 
అందువలన టీ తక్కువగా తాగాలి, లేదా గ్రీన్ టీ తాగడం ఉత్తమం. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసే వారు అతి తక్కువ మోతాదులో తినాలి. ఎందుకంటే రాత్రి పూట తిన్న వెంటనే పడుకోవడం వలన ఆహారం అజీర్తి, పొట్టచుట్టూ కొ్రవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu