Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖర్భూజ, స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే..?

ఖర్భూజ, స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే..?
, గురువారం, 26 మార్చి 2015 (18:46 IST)
ఖర్భూజ, స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మానికి నిగారింపు చేకూరుతుంది. మస్క్ మెలోన్ ముక్కలు, స్ట్రాబెర్రీ 3 వేసి, అందులో ఒక చెంచా ఓట్ మీల్, ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేసి శరీరం, ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. 15నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా మృదువుగా ప్రకాశవంతంగా మార్చుతుంది. 
 
అలాగే ఖర్భూజ-శెనగపిండి ప్యాక్ కూడా వేసవిలో చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది. ఒక కప్పు మస్క్ మెలోన్ జ్యూస్ తీసుకొని అందులో శెనగపిండి వేసి మిక్స్ చేయాలి. బాడీ మొత్తం స్క్రబ్ చేసి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం అందంగా.. ఆకర్షణీయంగా మారుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu