Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెయిర్ ఫాల్ కంట్రోల్‌కు 6 ఫుడ్స్!

హెయిర్ ఫాల్ కంట్రోల్‌కు 6 ఫుడ్స్!
, మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (14:08 IST)
సాధారణంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఏర్పడుతుంది. అంతేకాదు.. విటమిన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, అధిక ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవుట, అపరిశుభ్రమైన చర్మముతో జుట్టు రాలుతాయి. 
 
అలాంటప్పుడు నిరాశ చెందకుండా జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ క్రమంలో జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సిక్స్ సూపర్ ఫుడ్స్ తీసుకోండి. అవేంటంటే..
 
* మహిళలు ఉసిరికాయతో తయారు చేసిన నూనె జుట్టుకు ఉపయోగిస్తే నునుపైన కర్లీ జుట్టును పొందవచ్చు. 
 
* ప్రతి రోజు రాత్రి నీటిలో 5 బాదం పప్పులను నానబెట్టి ఉదయం దాని తొక్కలు తీసి తింటే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. 
 
* జుట్టుకు పోషణ అవసరం. అందువలన మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు వంటి జ్యూస్‌లను రోజుకు రెండు సార్లైనా తాగండి. అలాగే ప్రతి రోజు కనీసం 8-10 గ్లాసుల నీటిని త్రాగాలి.
 
* రోజూ ఒక కప్పు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవాలి. 
 
* ప్రోటీన్ల కోసం చికెన్, గుడ్డు ప్రతి రోజు తినాలి.
 
* ప్రతి రోజు టీ, కాఫీలను తీసుకోవడం తగ్గించండి.

Share this Story:

Follow Webdunia telugu