Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వచ్ఛమైన నెయ్యితో తెల్లజుట్టుకు చెక్ పెట్టండి!

స్వచ్ఛమైన నెయ్యితో తెల్లజుట్టుకు చెక్ పెట్టండి!
, శనివారం, 24 జనవరి 2015 (14:45 IST)
స్వచ్చమైన నెయ్యి లేదా స్వచ్చమైన బట్టర్‌ను తలకు వారంలో రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు నివారించుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే ఉసిరికాయ జుట్టు సంరక్షణకు ఒక అద్భుతమైన హోం రెమెడీ.
 
ఇది ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్‌ను నివారిస్తుంది . ఉసిరికాయ ముక్కల్ని కొన్నింటిని కొబ్బరినూనెలో వేసి, నల్లగా మారే వరకూ మరిగించాలి. తర్వాత క్రిందికి దింపుకొని, చల్లారిన తర్వాత తలకు మసాజ్ చేయడం వల్ల నేచురల్‌గా తెల్ల జుట్టును నివారిస్తుంది.
 
అలాగే అనేక చర్మ సమస్యలకు బాగా తెలిసిన ఔషధం కొబ్బరినూనె, అంతే కాదు తెల్లజుట్టును నివారించడంలో కూడా ఇది గ్రేట్‌గా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు మసాజ్ చేయడం వల్ల బ్లాక్ అండ్ షైనీ హెయిర్ పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu