Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రీన్ గ్రేప్స్‌ బ్యూటీ టిప్స్: బాదం, ఎండు ద్రాక్షల పేస్ట్‌తో..!

గ్రీన్ గ్రేప్స్‌ బ్యూటీ టిప్స్: బాదం, ఎండు ద్రాక్షల పేస్ట్‌తో..!
, సోమవారం, 14 జులై 2014 (16:55 IST)
గ్రీన్ గ్రేప్స్‌తో బ్యూటీ టిప్స్ ఏంటో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. మొటిమలకు గ్రీన్ గ్రేప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇంకా మొటిమలను రానీయకుండా నివారిస్తుంది. రెండు స్పూన్ల పుదీనా రసం, అర స్పూన్ పసుపు, గ్రేప్ జ్యూస్, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత కడిగిస్తే మొటిమలను దూరం చేస్తుంది.  
 
అలాగే చర్మం ముడత పడితే గ్రేస్ జ్యూస్.. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. ఒక పాత్రలో కోడిగుడ్డు తెల్ల సొన తీసుకుని.. అదే పరిమాణంలో గ్రేస్ జ్యూస్, నిమ్మరసాన్ని కలిపి బాగా మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి కడిగేస్తే.. నిత్య యవ్వనులుగా ఉంటారని బ్యూటీషన్లు అంటున్నారు.  
 
ఆరెంజ్ తొక్కల పౌడర్‌తో ఒక స్పూన్ గ్రేప్ జ్యూస్ కలిపి ముఖానికి, మెడకు పట్టిస్తే బ్లాక్ మార్క్ తొలగిపోతాయి. ఎండు ద్రాక్షలు, బాదం పప్పులు రెండింటిని కలిపి మిక్సిలో పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ఫేషియల్ చేసిన ఫలితం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu