Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిడ్డు, సున్నిత చర్మానికి చక్కటి ఫేస్ ప్యాక్స్ ఇవిగోండి!

జిడ్డు, సున్నిత చర్మానికి చక్కటి ఫేస్ ప్యాక్స్ ఇవిగోండి!
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (18:12 IST)
మీది జిడ్డు చర్మమా? సున్నితమైన చర్మమా? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి. రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా మొక్కజొన్న పిండీ, రెండు చెంచాల కీరదోస పొడి తీసుకుని అన్నింటిని కలిపి భద్రపరుచుకోవాలి. ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు ద్రాక్షరసంతో కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి పూతలా రాసుకోవాలి. 
 
అలాగే సున్నితమైన చర్మానికి... రెండు చెంచాల పాల పొడి, రెండు చెంచాల గోధుమ రవ్వా, రెండు చెంచాల మొక్కజొన్న పిండీ, చెంచా ముల్తానీ మట్టీ తీసుకుని.. అన్నింటినీ బాగా కలపాలి. ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా పొడి తీసుకుని అందులో బొప్పాయి లేదా పుచ్చకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu