Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రూ బెర్రీస్‌తో బ్యూటీ టిప్స్: ముడతలు, మచ్చలకు చెక్!

బ్రూ బెర్రీస్‌తో బ్యూటీ టిప్స్: ముడతలు, మచ్చలకు చెక్!
, బుధవారం, 13 మే 2015 (19:31 IST)
బ్లూ బెర్రీతో చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది. ముడతలను, మచ్చలకు బ్లూబెర్రీ ఫేస్ ప్యాక్ చెక్ పెట్టవచ్చు. కొన్ని బ్లూబెర్రీ పండ్లు తీసుకొని మెత్తగా మ్యాష్ చేయాలి. అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్‌లో బాగా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలాగే బాగా పండిన బొప్పాయి ముక్కలకు, కొద్దిగా తేనె, పంచదార వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం సౌందర్యం మెరుగవవుతుంది. 
 
ఇకపోతే.. చాక్లెట్ ను కరిగించి అందులో బాదం ఆయిల్, పంచదార వేసి మిక్స్ చేసి చర్మానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో మంచి నిగారింపు వస్తుంది. ముడతలను, మచ్చలను నివారించుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu