Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్లగా మారాలా? ఇవిగోండి 3 బెస్ట్ ఫెయిర్ ఫేస్ ప్యాక్స్!

తెల్లగా మారాలా? ఇవిగోండి 3 బెస్ట్ ఫెయిర్ ఫేస్ ప్యాక్స్!
, గురువారం, 12 మార్చి 2015 (17:53 IST)
తెల్లగా మారాలనుకుంటున్నారా? ఏవేవో క్రీములు వాడారా? అయితే ఇక వాటిని ఆపేయండి ఈ ఫేస్ ప్యాక్‌లను ఇంట్లోనే ట్రై చేయండి అంటున్నారు బ్యూటీషన్లు. అవేంటంటే బాదం, శెనగపిండి, పుదీనా ఫేస్ ప్యాక్స్. 
 
వీటిలో మొదటిది బాదం ఫేస్ ప్యాక్. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. నీళ్ళలో రాత్రంతా నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి కొద్దిగా పాలు వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. క్రమంగా ఫెయిర్ స్కిన్ పొందవచ్చు.
 
రెండోది శెనగపిండి ఫేస్ ప్యాక్. శెనగపిండిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించేటప్పుడు, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేయాలి. అలాగే మూడోది పుదీనా ఫేస్ ప్యాక్.  పుదీనా ఆకులు చర్మాన్ని కూల్‌గా మార్చుతాయి. పుదీనాను ఫేస్ ప్యాక్‌గా వేసుకోవడం వల్ల ఇది చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది. దాంతో చర్మఛాయాలో మార్పు వస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu