Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందంగా కనిపించాలంటే చీటికి మాటికి టెన్షన్ పడకండి!

అందంగా కనిపించాలంటే చీటికి మాటికి టెన్షన్ పడకండి!
అవును. అందంగా కనిపించాలంటే చీటికి మాటికి టెన్షన్ పడకూడదని బ్యూటీషన్లు అంటున్నారు. కొంతమంది ఎప్పుడూ నవ్వుతూ చురుగ్గా కనిపిస్తారు. అయితే మరికొందరైతే ఎప్పుడూ చిరాగ్గా కనిపిస్తారు. ఇలాంటి వారు చురుకుదనం కోల్పోతారని అధ్యయనంలో తేలింది. ఇంకా అందవిహీనంగా తయారవుతారని స్టడీ తేల్చింది.

500 మందిపై జరిపిన పరిశోధనలో.. చీటికి మాటికి టెన్షన్ పడేవారికంటే టెన్షన్ పడకుండా టేక్ ఇట్ ఈజీగా ఉండేవారే చలాకీగా, మరింత అందంగా ఉంటారని పరిశోధకులు తేల్చారు. అందంగా ఉండాలంటే మనసు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

సో... మీరు టెన్షన్ పార్టీ అయితే వెంటనే మీ టెన్షన్‌ను డస్ట్‌ బిన్‌లో వేసేయండి. లేదంటే అందం మీకు దూరంగా ఎస్కేప్ అయిపోతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu