Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్ ఒడిలో కనువిందు చేసే అందాలు

రాజస్థాన్ ఒడిలో కనువిందు చేసే అందాలు
రాజస్థాన్‌ (ఏజెన్సీ) , సోమవారం, 4 జూన్ 2007 (12:48 IST)
భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్‌కు పశ్చిమాన పాకిస్తాన్ ఉంది. ఇంకా నైఋతి దిక్కున గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన భాగంలో ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన పంజాబ్ రాష్ట్రాలు హద్దులుగా ఉన్నాయి. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు).

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్, ఘనా పక్షి ఆశ్రయము, భరత్ పూర్ పక్షుల ఆశ్రయం ఉంది.

రాజపుత్రులచే పాలింపబడినది గనుక రాజస్థాన్‌కు "రాజపుటానా" అనే పేరుతో పిలిచేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే బ్రిటిష్ పాలకులు మాత్రం వేరు వేరు ఒడంబడికలతో రాజస్థాన్‌లోగి జొరబడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu