Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేప... మా ఇంటి ఆరోగ్య దేవత

వేప... మా ఇంటి ఆరోగ్య దేవత
దాదాపు 200 ఏళ్లపాటు జీవించే చెట్టు వేప. వేప చెట్టులోని అన్ని భాగాలు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి. అందువల్లనే వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు.

చర్మ వ్యాధులు (గజ్జి,తామర), కంటి జబ్బులు, కడుపులోని పురుగులు నివారణ, బి.పి, మలేరియా వంటి పలు వ్యాధుల నివారణకు యాంటి సెప్టిక్ మందుగా వైద్యులు వేప ఆకులను ఉపయోగిస్తారు.

చికెన్ పాక్స్‌గా పిలువబడే అమ్మవారు సోకినపుడు చికిత్సలో భాగంగా రోగిని వేప ఆకులపై పడుకోబెడతారు. చర్మంపై మంటలు, దురదలు, మధుమేహం వంటి వ్యాధులను అదుపు చేయడానికి వేప పూలను వినియోగిస్తారు. సౌందర్య పోషణలో భాగంగా కొందరు వేప ఆకులు వేసి కాచిన నీటితో స్నానం చేస్తారు.

ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు ఇలా చెప్పాడు.... "ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు". ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu