కొత్త సంవత్సరం 2026 నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. మహాలక్ష్మీ రాజయోగం, హంస మహా పురుష రాజయోగం, గజకేసరి రాజయోగం, బుధాదిత్య అనే నాలుగు రాజయోగాలతో ప్రారంభం కాబోతోంది. ఈ యోగాల శక్తివంతమైన ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం బాగా కలిసివస్తోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాలుగు రాశులకు ఈ రాజయోగం బాగా పనిచేస్తుందని.. అంటున్నారు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం..
ముందుగా కర్కాటక రాశి వారికి రాజయోగం బాగా పనిచేస్తుంది. తిరిగి రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఏడాదిలో ఈ రాశివారి వ్యక్తిగత జీవితం చాలా అభివృద్ధి చెందుతుంది. కొత్తగా ఇళ్లు, ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు భారీ లాభాలుంటాయి. ఉద్యోగులకు కలిసివచ్చేకాలం.
కన్యారాశికి ఆదాయం ఆర్జించే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు లాభదాయకం. కుటుంబ సంబంధాలు, బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. అనేక శుభ పరిణామాలు కలుగుతాయి. ధైర్యంగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి పంచాంగ యోగం వల్ల ధన ప్రవాహం సజావుగా ఉంటుంది. స్థిరమైన సంపద లభిస్తుంది. పెట్టుబడుల గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ పరిచయాల ద్వారా లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మకర రాశి వారికి జూన్ నెల వరకు ఈ రాశివారికి తిరుగులేదు. కొత్త పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందుతారు. కొత్తగా ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు కలిసివచ్చే కాలం. జీవితం సుఖమయమవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.