2013 అక్టోబర్ లోపు మీకు వివాహం అవుతుంది
, మంగళవారం, 17 ఏప్రియల్ 2012 (14:09 IST)
ఎమ్.ఎస్.కె.సాగర్- మహబూబ్‌నగర్ : మీరు నవమి శనివారం, సింహలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకు సగం పూర్తి కావడం వంటివి ఎదుర్కొంటున్నారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన తెల్లని గులాబీలతో శనిని పూజించినా మీకు దోషాలు తొలగిపోతాయి. భార్యస్థానాధిపతి అయిన శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. 2013 అక్టోబర్ లోపు మీకు వివాహం అవుతుంది. 2006 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2012 జూన్ నుంచి 2023 వరకు యోగాన్ని ఇస్తాడు. గరుడపచ్చ అనే రాయిని ధరించండి. మీకు శుభం కలుగుతుంది.