శివరాజ్యలక్ష్మి.. మీరు పాతకకాలసర్పదోషం శాంతి చేయించండి
శివరాజ్యలక్ష్మి-బొబ్బిలి
Advertiesment
, గురువారం, 26 ఏప్రియల్ 2012 (16:22 IST)
FILE
శివరాజ్యలక్ష్మి-బొబ్బిలి
మీరు చతుర్ధశి బుధవారం తులా లగ్నము, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ఒక శనివారం నాడు 20సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 20 వత్తులు ఏకం చేసి సాయిబాబా గుడిలో ఉండే దునిలో 4 లేక ఐదు జెమ్మి సమిధలను వేయండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది.
గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, పాతకకాలసర్పదోషం శాంతి చేయించండి. మీరు కార్పొరేట్ సంస్థల్లో బాగా రాణిస్తారు. 2015 వరకు సామాన్యంగా ఉన్నా తదుపరి బుధ మహర్ధశ 17 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధిని పొందుతారు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.