వరప్రసాద్ గారూ.. మీరు కార్తీకేయుడిని ఎర్రని పూలతో పూజించండి
ఎ. వరప్రసాద్-భద్రచాలం:
Advertiesment
, సోమవారం, 16 ఏప్రియల్ 2012 (12:55 IST)
FILE
ఎ. వరప్రసాద్-భద్రచాలం:
మీరు పంచమి శనివారం, మకరలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. సప్తమస్థానము నందు బృహస్పతి ఉచ్ఛి చెందడం వల్ల మంచి పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. అష్టమ స్థానము నందు శని, రాహువులు ఉండటం వల్ల కళ్ళు , తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి.
2011 ఏప్రిల్ నుంచి కుజ మహర్ధశ ప్రారంభమైంది. ఈ కుజుడు ఏడు సంవత్సరములు 80 శాతం యోగాన్ని ఇస్తుంది. 2013 నుంచి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. 2018 నుంచి రాహు మహర్ధశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని ఇస్తుంది. కార్తికేయుడిని ఎర్రని పూలతో పూజించండి. మీకు శుభం కలుగుతుంది.