మీరు ఏకాదశి ఆదివారం, సింహలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి. మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడతారు.
2010 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 నవంబర్ నుంచి 2027 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తాడు. 2014 లేక 2015 నందు గృహయోగం ఏర్పడుతుంది. సంకల్పసిద్ధి గణపతిని పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది.