Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో గుర్తింపు రావడం లేదు...

నేను ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో గుర్తింపు రావడం లేదు...
శ్రీరామ మణి కిరణ్-
మీరు పూర్ణిమ సోమవారం హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 వరకు మీకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది.

ఆర్థిక ఇబ్బందులంటూ ఉండవు. ఉద్యోగంలో మీకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాఘవేంద్రస్వామిని ఆరాధిస్తే మీ సంకల్పం సిద్ధిస్తుంది.

మా ప్రియమైన వీక్షకులకు మనవి:
చాలామంది తమ పుట్టినరోజు, పుట్టిన సమయం, జన్మ నక్షత్రం తెలుపకుండా కేవలం సమస్యలను మాత్రమే రాసి పంపిస్తున్నారు. ఈ వివరాలు లేనిదే మీ సమస్యకు సమాధానం తెలియజేయడం కష్టతరమవుతుంది.

కనుక దయచేసి కనీసం మీ పుట్టినరోజు, పుట్టిన సమయం తప్పక పొందుపరచండి. అదేవిధంగా ఒకే పేరుతో చాలామంది వీక్షకుల వద్ద నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారు వేరు వేరు ప్రదేశాలనుంచి పంపుతున్నప్పటికీ ఒకే పేరువల్ల ప్రచురణలో మీకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కనుక పుట్టిన తేదీ, పుట్టిన సమయం, జన్మ నక్షత్రంతోపాటు మీ ఊరు పేరును కూడా జోడించగలరు.

Share this Story:

Follow Webdunia telugu