ఏలినాటి శని దోషం ఉన్నది.. వేప నూనెతో దీపారాధన చేయండి
, శనివారం, 7 ఏప్రియల్ 2012 (21:45 IST)
గౌరీశంకర్ - విశాఖపట్నం: మీరు దశమి శుక్రవారం మీనలగ్నము, హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి వేపనూనెతో శనికి దీపారాధన చేసినా మీకు దోషాలు తొలగిపోతాయి. మీ 31 లేక 32వ సంవత్సరము నందు మీకు వివాహం అవుతుంది. దక్షిణం నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ సంబంధం స్థిరపడుతుంది. మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది. లక్ష్మీనారాయణుడిని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.