16-09-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు....

రామన్
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికస్థితి ఆశాజనకం. రుణ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. దుబారా ఖర్చులు విపరీతం. మొండిగా పనులు పూర్తి చేస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుక్నుట్టే జరుగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పిల్లల కదలికలపై దృష్టిపెట్టండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. పనులు సానుకూలమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపుకు అవకాశం లేదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు నెలకొంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది బాధ్యతలు అప్పగించవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకకు హాజరవుతారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. ఆరోగ్యం జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు తొలగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పనులు, బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

తర్వాతి కథనం
Show comments