Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

Advertiesment
kanya rashi

రామన్

, శుక్రవారం, 12 డిశెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. ముఖ్యులను సంప్రదిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశం కలిసివస్తుంది. రావలసిన ధనం అందుతుంది. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. దుబారా ఖర్చులు విపరీతం. అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. రుణ సమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు స్వయంగా చూసుకోండి. సాయం ఆశించవద్దు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. అనుకున్నది సాధిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సగంలో నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ముఖమైన పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనులు వేగవంతమవుతాయి. పందాలు, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సన్నిహితుల వ్యాఖ్యులు కార్యోన్ముఖులను చేస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. నగదు, పత్రాలు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆత్మీయులు ఆదుకుంటారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అందరితోను మితంగా సంభాషించండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Double Decker Bus: సింహాచలానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్