Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రమాదం అంచున పులికాట్ సరస్సు

ప్రమాదం అంచున పులికాట్ సరస్సు
సూళ్ళూరు పేట (ఏజెన్సీ) , బుధవారం, 26 డిశెంబరు 2007 (15:19 IST)
FileFILE
దేశంలో అతిపెద్దదైన రెండవ సరస్సుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవానికి 600 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో అలరారుతున్న ఈ సరస్సు గడచిన రెండు దశాబ్దాల కాలంలో 400 చదరపు కి.మీ.ల విస్తీర్ణానికి కుదించుకుపోయింది. దీంతో సరస్సులో జల జీవాలు మరియు వలస పక్షుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది.

జలజీవాల జనాభా సంఖ్యతో పాటు సరస్సు లోతు నాలుగు మీటర్ల నుంచి రెండు మీటర్లకు తగ్గిపోయిందని సూళ్ళురు పేట డివిజన్ అటవీ అధికారి రామలింగం మీడియాతో బుధవారం అన్నారు.

సరస్సులో నీటి పరిమాణం తగ్గిపోవడంతో శీతాకాలంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చే ఫ్లెమింగో, పెయింటెడ్ స్టోర్క్‌స్, ఎగ్రెట్స్, గ్రే పెలికాన్లు, గ్రే హెరోన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

webdunia
FileFILE
2002 సంవత్సరంలో వలస వచ్చిన ఫ్లెమింగో పక్షుల సంఖ్య 30,000 కాగా, గత సంవత్సరం ఆ సంఖ్య 7,000 కు పడిపోయిందని, సగటున వలస పక్షుల సంఖ్య 50 శాతానికి తగ్గిపోయిందని రామలింగం వెల్లడించారు.

వలస పక్షుల సంఖ్య పడిపోవడం మరియు జలజీవాలు తగ్గిపోవడానికి సరస్సులో ఇసుకు మేట వేయడమే ప్రధాన కారణంగా ఆయన అన్నారు. చేపలు పట్టేవాళ్లు రెండు మి.మీ.ల వెడల్పు రంధ్రాలను కలిగిన వలలను ఉపయోగించడం కూడా జల జీవాల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా తెలిపారు.

అదేసమయంలో సరస్సు ఆక్రమణలకు గురవుతున్నదనే అంశాన్ని ఆయన తోసి పుచ్చారు. ఇటీవల కేటాయించిన 800 ఎకరాలలోని పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతిని రామలింగం ప్రస్తావించారు.

ఇరాన్‌లోని రమ్‌సర్ చిత్తడి ప్రాంతాన్ని ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సు రక్షిత ప్రాంతంగా గుర్తించిన తీరుగా, కేంద్ర ప్రభుత్వం పులికాట్ సరస్సును పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu