Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంటల్లో తేలనున్న నాయకుల జాతకాలు

గంటల్లో తేలనున్న నాయకుల జాతకాలు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలే తరువాయి. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల జాతకాలు మరికొన్ని గంటల్లో తేలనుంది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు(శనివారం) ప్రారంభం కానున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడక ముందే నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభంమవుతుంది.

ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో 106 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4వేలమంది పోలీసు సిబ్బందిని ఓట్ల లెక్కింపు కార్యక్రమ భద్రతకు వినియోగించుకుంటున్నట్లు ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు.

రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా 4 కోట్ల 19 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌కు దాదాపు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రౌండ్ల వారీగా ఫలితాలను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నామని ఈసీ పేర్కొంది.

రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 569మంది పోటీ చేశారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీకి 294 స్థానాలుండగా, వీటికి దాదాపు 3655మంది పోటీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వి.సుబ్బారావు తెలిపారు. వీరిలో విజేతలు ఎవరో తెలుసుకోవడానికి మరిన్ని గంటలు వేచిచూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu