Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొనసాగుతున్న గాంధీల హవా

కొనసాగుతున్న గాంధీల హవా

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

2009 సార్వత్రిక ఎన్నికలలో యూపీఏ సునాయాస విజయాన్ని కైవసం చేసుకున్నది. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా రెండోసారి ప్రధానమంత్రి కిరీటాన్ని మన్మోహన్ ధరించి రికార్డు సృష్టించారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన సత్తాను చాటింది. అయితే దీనివెనుక జవహర్ లాల్ నెహ్రూ వారసుల కృషి ఎంతో ఉంది. సువిశాల ద్వీపకల్పంలో ముగ్గురు గాంధీలు చేసిన పర్యటనలు, ఇచ్చిన హామీలే తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరనుకుంటున్నారు... సోనియా, రాహుల్, ప్రియాంక
రైతన్నల గుండెల్లో రాహుల్
  భావి ప్రధానిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ రూటే వేరు. ఆయన గ్రామీణ ప్రాంతాలలోని మారుమూల పల్లెలకు వెళతారు. అక్కడి ఓ సామాన్యుని టీ కొట్టులో టీ సేవిస్తారు. ఆ ప్రక్కనే వ్యవసాయం చేసుకుంటున్న కూలీలు ఆశ్చర్యపోయేలా పొలం గట్టుపై నడిచి వెళ్లి "ఎలా ఉన్నారూ..?"      


భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత వద్దంటూనే రాజకీయాలలోకి అడుగుపెట్టిన సోనియాగాంధీ నేడు అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలుగా ప్రసిద్ధికెక్కారు. ఆమె స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు విదేశీ మంత్రాన్ని జపించే ప్రతిపక్షాలను బెంబేలెత్తిపోయేలా ఆమె తన రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలపై దృష్టి సారిస్తూనే... అగ్ర దేశాలతో సత్సంబంధాలకు కృషి చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేస్తున్నప్పటికీ తెరవెనుక రథ సారథి మాత్రం సోనియాగాంధీ అన్నది నిజం. ఆమె పాటించిన ఇలాంటి ఎన్నో సూత్రాలు తిరిగి పీఠాన్ని అందించాయి.

భావి ప్రధానిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ రూటే వేరు. ఆయన గ్రామీణ ప్రాంతాలలోని మారుమూల పల్లెలకు వెళతారు. అక్కడి ఓ సామాన్యుని టీ కొట్టులో టీ సేవిస్తారు. ఆ ప్రక్కనే వ్యవసాయం చేసుకుంటున్న కూలీలు ఆశ్చర్యపోయేలా పొలం గట్టుపై నడిచి వెళ్లి "ఎలా ఉన్నారూ..?" అని వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ఆ రోజు వారితోపాటే వారు తెచ్చుకున్న భోజనాన్ని ఆరగిస్తారు. మొత్తంగా వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా కలిసిపోతారు.

ఒళ్లు వంచి కష్టించి పనిచేసే రైతన్నలు పిడికెడు భోజనం ఎంత రుచిగా ఉంటుందో రాహుల్ గాంధీకి తెలుసు. అందుకే ఆయన నేడు భారతావనిలో చాలామంది కార్మికులకు ఆత్మబంధువు. అందుకే వాళ్లందరూ రాహుల్ గాంధీని అమితంగా ఆరాధిస్తున్నారు. అందుకే ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టారు. యువత, కార్మిక, బడుగు, బలహీన వర్గాల సముద్ధరణే తన ధ్యేయం అంటారు యువరాజు రాహుల్ గాంధీ. ఈ దిశగానే తన అడుగులు సాగుతాయంటారు ఈ వినయశీలి.

webdunia
ఇక ప్రజల మధ్యకు చొచ్చుకుపోయే నాయకురాలుగా సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి పేరు ఉన్నది. ఆమె పర్యటించిన ప్రాంతంలో ప్రియాంక ప్రసంగాలను అక్కడి ప్రజలు మరువలేరంటే... ప్రియాంక వాగ్ధాటి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నానమ్మ ఇందిరాగాంధీ పోలికలున్న ప్రియాంక సందర్శించిన అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇలా చూసినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఈ ముగ్గురు గాంధీల పాత్ర ఎంతో ఉందని అనిపిస్తుంది కదూ...

Share this Story:

Follow Webdunia telugu