Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోటుకు బదులు ఓటు..ఇదేం కొత్త కాదు

ఓట్లకోసం నోట్లు పంచడంలో కర్నాటక ఫస్ట్

నోటుకు బదులు ఓటు..ఇదేం కొత్త కాదు

Gulzar Ghouse

, శుక్రవారం, 27 మార్చి 2009 (17:46 IST)
భారతీయ జనతాపార్టీ యువ నాయకుడు వరుణ్ గాంధీ, కథానాయకుడు నుంచి నాయకుడుగా మారిన గోవిందా మరియు సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఎన్నికలకు ముందుగా ప్రజలకు డబ్బులు పంచి ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందుకున్నారు. కాని నాయకులు ఓట్లకోసం డబ్బులు పంచడం ఎన్నో సంవత్సరాలకు మునుపే ప్రారంభమైందని సర్వేలు చెబుతున్నాయి.

ఓట్లకోసం నోట్లు పంచే సంస్కృతి కేవలం ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించింది కాదు. ఇది దేశవ్యాప్తంగా నెలకొని ఉందని ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎమ్ఎస్) పేర్కొంది.

లంచంరూపంలో ఓటుకోసం నోటు అనే సంస్కృతి మొదట్లో కర్నాటకలో ప్రారంభమైంది. నిరుడు జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో అత్యధికంగా ఓట్లను కొనుగోలు చేసినట్లు సర్వేలో తేలింది.

నిరుడు 2008లో వామపక్షాలు పరిపాలించే రాష్ట్రాలు కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో జరిగిన ఎన్నికలలో కూడా ఓటుకు నోటు పేరుతో లంచాల రూపంలో డబ్బులు భారీస్థాయిలో చేతులు మారినట్లు సర్వేలు తెలుపుతున్నాయి.

ఇదిలావుండగా అత్యధిక విద్యాధికులైన రాష్ట్రాలు తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఓటర్లను డబ్బులతో కొనే సంస్కృతి అధికంగా ఉంది. ఈ రాష్ట్రాలలో దాదాపు 40శాతం ప్రజలు తమకు నోటు అందితేనే ఓటు వేసే అలవాటున్నట్లు సీఎమ్ఎస్ సర్వేలో తేలిందని సర్వే నిపుణులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu