Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు అత్త ఊరు ప్రేమంటే ఇదేగా... ఎమ్మెల్యే రోజా సెటైర్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిన్న శ్రీశైలంలో కృష్ణా పుష్కరాలు చివరి రోజు నాడు పుణ్యస్నానాలు చేశారు. తన కుటుంబ సమేతంగా ఆమె పుష్కర స్నానమాచరించారు. ఆమె భర్త సెల్వమణి తన పితృదేవతలకు పిండప్రదానం కార్యక్రమాలను చేశారు. ఆ తర్వాత ఆమె మీడి

చంద్రబాబు అత్త ఊరు ప్రేమంటే ఇదేగా... ఎమ్మెల్యే రోజా సెటైర్లు
, బుధవారం, 24 ఆగస్టు 2016 (14:16 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిన్న శ్రీశైలంలో కృష్ణా పుష్కరాలు చివరి రోజు నాడు పుణ్యస్నానాలు చేశారు. తన కుటుంబ సమేతంగా ఆమె పుష్కర స్నానమాచరించారు. ఆమె భర్త సెల్వమణి తన పితృదేవతలకు పిండప్రదానం కార్యక్రమాలను చేశారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. 
 
పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీగా మార్చుకున్నారని విమర్శించారు. సీఎంకు తన అత్త ఊరుపై ఉన్న ప్రేమ కూడా కనబడుతోందనీ, విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేస్తూ ఆ విధంగా ముందుకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల సమస్యలు ఎదురయ్యాయనీ, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు విజయవాడనే లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారంటూ విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అమ్మాయిలకు డిమాండ్.. ఎందుకు తెలుసా?