Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రసాభాసగా మున్సిపల్ సమావేశం...నేతల బాహాబాహీ..!

రసాభాసగా మున్సిపల్ సమావేశం...నేతల బాహాబాహీ..!
, బుధవారం, 4 మార్చి 2015 (12:01 IST)
తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో బుధవారం ఉదయం ప్రారంభమైన మున్పిసల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు ఒకరిపై ఒకరు తలపడ్డారు. తెలుగుదేశం, వైకాపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
ఆ వాగ్వాదం విర్రవీగడంతో ఒకరిపై ఒకరు బాహాబాహీ తలపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అప్పారావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఇరు పార్టీలు మధ్య ఉద్రిక్తత తలెత్తింది. దీంతో అక్కడ చోటు చేసుకున్న తోపులాట కొట్టుకునే దాకా వచ్చింది.
 
సమావేశంలో సభ్యుల బాహాబాహీతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ రజనీ శేషసాయి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు కూడా ఒకరినొకరు తోసుకున్నారు.

అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ మురళీ జోక్యం చేసుకుని సమావేశానికి వచ్చిన ఇతరులను బయటకు పంపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ పడుతున్న సభ్యులను కట్టడిచేశారు. ఈ సంఘటన పార్టీ వర్గాలలో కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu