Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొణతాల చేజారకుండా చూడండి : సుబ్బారెడ్డికి జగన్ ఆదేశం!

కొణతాల చేజారకుండా చూడండి : సుబ్బారెడ్డికి జగన్ ఆదేశం!
, బుధవారం, 29 అక్టోబరు 2014 (08:49 IST)
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. 
 
వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత స్పందించినట్టు సమాచారం. కొణతాల ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకోండని పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తదితరులకు జగన్ పురమాయించారు. 
 
జగన్ ఆదేశాలతో కొణతాలను సంప్రదించడానికి పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొణతాల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటమే దానికి కారణం. ఏదేమైనప్పటికీ... కొణతాలను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలని జగన్ సూచించారు. అంతేకాకుండా, కొణతాల రామకృష్ణ పార్టీ వీడకుండా చూడాలని ఆయన కోరినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu