Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారిది తోక పార్టీ..! వీరి తోక వారు కట్ చేస్తారట....!! ఎవరి తోక ఎవరు కట్ చేస్తారు ?

వారిది తోక పార్టీ..! వీరి తోక వారు కట్ చేస్తారట....!! ఎవరి తోక ఎవరు కట్ చేస్తారు ?
, గురువారం, 3 సెప్టెంబరు 2015 (08:18 IST)
వారిది తోక పార్టీ అయితే.. వీరి తోక వారు కట్ చేస్తారట. ఇదే వారిదే తోక పార్టీ అయినప్పుడు వీరితోక ఎలా కట్ చేస్తారు? ఇలాంటి సందేహాలు ఎన్నో కలుగుతాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటే బుర్ర వేడెక్కుతుంది. మన శాసనసభలో సభ్యల మధ్య జరిగే సంభాషణలు అలా ఉంటాయి. ఏపీ అసెంబ్లీ ఆసక్తికర సంభాషణలతో పాటు గతంలో ఎప్పుడూ వినని కొత్త పదాలకు కూడా వేదికవుతోంది. బుధవారం నాటి  సమావేశాల్లో భాగంగా వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, బీజేపీ శాసనసభా పక్షనేత పెన్మత్స విష్ణుకుమార్ రాజుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. 
 
పట్టిసీమ ప్రాజెక్టుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్న సమయంలో ‘మీది ఒక తోక పార్టీ’ అంటూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. దీనిపై విష్ణుకుమార్ రాజు వెనువెంటనే ఘాటుగా స్పందించారు. ‘‘మాది తోక పార్టీ అయితే, మీ తోకలు కత్తిరించడానికి 2 నిమిషాలు చాలు’’ అని హెచ్చరించారు. జాతీయ పార్టీ అయిన తమ పార్టీపై జ్యోతుల చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా తోకలు శాసనసభలో హల్ చల్ చేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu