Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఇల్లాలిని ప్రియురాలు సిరంజ్ దాడితో చంపలేదట.. రూ.15 లక్షలు సుపారీ ఇచ్చి భర్తే చంపిచాడట!

ఆ ఇల్లాలిని ప్రియురాలు సిరంజ్ దాడితో చంపలేదట.. రూ.15 లక్షలు సుపారీ ఇచ్చి భర్తే చంపిచాడట!
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (20:47 IST)
ప్రకాశం జిల్లా చీరాలలో ఓ ఇంటి ఇల్లాలిపై ఆమె భర్త ప్రియురాలు యాసిడ్ నింపిన సిరంజ్‌తో దాడి చేసి హత్య చేసిన కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో భార్యను హతమార్చేందుకు ఆ మహిళ (ప్రియురాలు)కు రూ.15 లక్షల సుపారీ ఇచ్చి, కిరాయి హంతకులతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చీరాల ఎల్‌బీఎస్‌ నగర్‌కు చెందిన ఇలియాజ్‌ అనే వ్యక్తికి చీరాల, గుంటూరుల్లో చికెన్‌ షాపులున్నాయి. దుకాణం పనిమీద గుంటూరు వెళ్లే ఇలియాజ్‌కు అక్కడ వహీదా అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇలియాజ్ భార్య హసీనాకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. పైగా, ఫోనులో వహీదాను హసీనా తిడుతూ వచ్చింది. ఈ తిట్లు భరించలేదని వహీదా.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా ఇద్దరు మహిళలను తీసుకుని మంగళవారం చీరాలకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇలియాజ్‌ ఇంటికి వెళ్లింది. ఇద్దరు మహిళలు హసీనాను గట్టిగా పట్టుకోగా మరొకరు సిరంజిలో యాసిడ్‌ (బంగారాన్ని శుద్ధి చేయడానికి వాడే ద్రావణం) ఎక్కించి హసీనా మెడపైన, చేతిపైనా ఇంజెక్షన్‌ చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన హసీనా పిల్లలు కేకలు వేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 
 
అయితే, పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ముగ్గురినీ పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. అస్వస్థతకు లోనైన హసీనాను స్థానికంగా ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి గుంటూరుకు తరలించగా చికిత్సపొందుతూ ఆమె మరణించింది. 
 
ఈ కేసులో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. భార్యను హత్య చేయించేందుకు భర్తే రూ.15 లక్షలు, ఇంటి స్థలం సుపారీగా ఇచ్చినట్టు తేలింది. కిరాయి హంతకులు పట్టుబడటంతో ఆ హంతక భర్త కటకటాలపాలయ్యాడు. 
 
షర్మిలా అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగిన ఇలియాజ్‌ భార్య హషీనాను అడ్డు తొలగించుకునేందుకు భారీ మొత్తంలో సుఫారీ ఇచ్చినట్లు గుర్తించారు. కిరాయి హంతకులతోపాటు భర్త ఇలియాజ్‌, ఆయన ప్రియురాలు షర్మిలాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి భర్త అరెస్టు.. పోలీసుల అదుపులో మమతా కులకర్ణి!