మొదట అక్కను చంపేశాడు.. ఇపుడు చెల్లిని చంపేసిన శాడిస్ట్ బ్యాంక్ మేనేజర్?
బ్యాంకు మేనేజర్ భార్య అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత అక్కను చంపేసిన శాడిస్ట్ బ్యాంకు మేనేజర్.. ఇపుడు చెల్లిని కూడా ఎవరికీ అనుమానం రాకుండా చంపేశాడు. దీనిపై పోల
బ్యాంకు మేనేజర్ భార్య అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత అక్కను చంపేసిన శాడిస్ట్ బ్యాంకు మేనేజర్.. ఇపుడు చెల్లిని కూడా ఎవరికీ అనుమానం రాకుండా చంపేశాడు. దీనిపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడకు చెందిన గోలి శ్రీదేవి(38)కి కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రవిశంకర్‌తో 1989లో వివాహమైంది. కర్ణాటకలో పనిచేసే రవిశంకర్ ఇటీవల బదిలీపై హైదరాబాద్‌కు వచ్చి ఎర్రగడ్డలో నివాసముంటూ హైదర్‌గూడలోని బ్రాంచిలో పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తన భార్య ఇంట్లో ఉన్న దీపం మీద పడి ఒంటికి మంటలు అంటుకున్నాయని పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీదేవి శుక్రవారం మృతి చెందిందని కాకినాడలో ఉండే ఈమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై శ్రీదేవి తల్లిదండ్రులు పోలీసులకు అల్లుడి సందేహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు.
అంతేకాకుండా, బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని భావించి పెద్ద కూతురు లక్ష్మీనర్సమ్మను రవిశంకర్‌కు ఇచ్చి పెళ్లి చేశామని, 1988లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడని తల్లి రామాబాయి పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటికే ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో రవిశంకర్ వేరే వారిని చేసుకుంటే పిల్లలు ఇబ్బందులు పడతారని తమ చిన్న కూతురు శ్రీదేవినిచ్చి పెళ్లి చేస్తే ఆమెను కూడా పొట్టనపెట్టకున్నాడని ఆరోపించింది. తమ ఇద్దరు కుమార్తెల అనుమానాస్పదమృతిలో అల్లుడికి ప్రమేయముందని ఆరోపించింది.