అనకాపల్లి జిల్లా చోడవరం మండలం కనకమహాలక్ష్మి నగర్‌లోని ఓ ఇంట్లో 30 ఏళ్ల మహిళ, ఆమె ఆరు నెలల కుమారుడు అనుమానాస్పందంగా మృతి చెంది కనిపించారు. మృతులను పోరెడ్డి వీణ (30), ఆమె కుమారుడు పోరెడ్డి వియాన్ష్‌గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఈ మరణాలు సంభవించాయని పోలీసులు భావిస్తున్నారు.
వీణ తల్లిదండ్రులు తమ బిడ్డను వరకట్న వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇంకా వీణ తల్లదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, వరకట్న వేధింపులతో ఏర్పడిన మరణానికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304-బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. శ్రావణి గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించి, తనిఖీ నిర్వహించి దర్యాప్తును సమీక్షించారు. వీణ కుటుంబం చేసిన ఆరోపణల మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె మీడియాకు ధృవీకరించారు.